Tur

కంది పప్పు

అంచనాలు

కోత అంచనా

7.2-8 క్విన్టాళ్లు /ఎకరానికి

పంట వ్యవధి అంచనా

విత్తనాలు వేసిన 180-190 రోజుల తరువాత

అంచనా పెట్టుబడి (రూపాయి)

19,092

అంచనా దిగుబడి (రూపాయి)

 37,500

అనుకూలమైన వాతావరణ పరిస్థితులు

వాతావరణం
 • దీని పెరుగుదల కాలంలో తేమ మరియు వెచ్చని వాతావరణం ప్రయోజనకరంగా ఉంటుంది.
 • దీని పూత మరియు పక్వానికి వచ్చే దశల్లో కాపు సమర్ధవంతంగా రావడానికి ప్రకాశవంతమైన ఎండతో కూడిన వాతావరణం అవసరం.
 • పూత పూసే సమయంలో మంచును తట్టుకునే శక్తిని కోల్పోతుంది మేఘావృత వాతావరణం మరియు అధిక వర్షపాతం.
 • పూతపూసే సమయంలో పంటను చాలా వరకు దెబ్బతీస్తాయి.
ఉష్ణోగ్రత
 • 21-25℃ ఉష్ణోగ్రతలో బాగా పెరుగుతుంది.
 • కందికాయ అభివృద్ధి మరియు  పూత పూసే సమయంలో కందులు తక్కువ ఉష్ణోగ్రత వద్ద చాలా సున్నితంగా ఉంటుంది.
 • మేఘావృత వాతావరణం పేలవమైన కాయ ఏర్పడటానికి దారితీస్తుంది.
పంట నీటి అవసరం
 • పూత పూసే సమయంలో మరియు కాయ ఏర్పడే కాలంలో మట్టి తేమ సరిపోకపోవడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.
 • నీటి అవసరం- 600-650 మి.మీ వర్షపాతానికి సమానమైన నీరు అవసరం.

అనుకూలమైన మట్టి పరిస్థితులు

మట్టి రకము
 • మంచిగా నీటి పారుదలతో మధ్యస్తం నుండి భారీ ఆకృతి గల నేల అవసరం
 • బంకమన్ను మరియు నీటి పారుదల  ఉన్న నేలలో పంటను పండించలేము.
 • నీటి పారుదల కలిగిన ఎర్ర బంక రేగడ నేలలో అధికంగా పండుతుంది.
ఉదజని (పి. హెచ్.)
  • అవసరమైన పరిధి- 6.5 నుండి 7.5 వరకు.
  • ఆమ్లము-ఆల్కలీన్ మరియు నీరు నిల్వ ఉన్న నేలలు కంది పంట పండించడానికి అనుకూలమైనవి కాదు ,ఈ పరిస్థితులు పంట ఎదుగుదలకు హాని చేస్తుంది.
  • ఉదజని <6.5 అయితే సున్నం ను  జోడించండి.
  • ఉదజని >7.5 అయితే జిప్సం ను జోడించండి.

నాటడానికి అవసరమైనవి

విపుల
కాలము
150-170
ప్రత్యేక లక్షణాలు
నిరంతర మరియు అంతర పంట వ్యవస్థలో అధిక దిగుబడి,తడి కుళ్ళు తెగులు మరియు గొడ్డుతనానికి మధ్యస్థుగా తట్టుకుంటుంది
కాలం
ఖరీఫ్
దిగుబడి
9.6-10.4 క్వింటాల్/ఎకరానికి
ఫూలే రాజేశ్వరి
కాలము
140-150
ప్రత్యేక లక్షణాలు
తడి కుళ్ళు తెగులు మరియు గొడ్డుతనానికి తట్టుకుంటుంది
కాలం
ఖరీఫ్
దిగుబడి
11.2-12క్వింటాల్/ఎకరానికి
ICPL 87
కాలము
120-130
ప్రత్యేక లక్షణాలు
పరిమిత పెరుగుదల, గుత్తుల‌లో కందికాయ, పరాపక్వానికి అధనంగా ముందుగా వస్తుంది
కాలం
ఖరీఫ్
దిగుబడి
7.2-8.0క్వింటాల్/ఎకరానికి
AKT 8811
కాలము
140-150
ప్రత్యేక లక్షణాలు
పరాపక్వానికి ముందుగా వస్తుంది.నిరంతర మరియు అంతరపంట వ్యవస్థ రకం
కాలం
ఖరీఫ్
దిగుబడి
6.0-6.4 క్వింటాల్/ఎకరానికి
BSMR 853
కాలము
160-170
ప్రత్యేక లక్షణాలు
మధ్య తరహా ఎరుపు లేతరంగు ధాన్యం, తడి కుళ్ళు తెగులు మరియు గడ్డుతనాన్ని తట్టుకుంటుంది నిరంతర పంట విధానం మరియు అంతర పంటలకు మంచి రకం
కాలం
ఖరీఫ్
దిగుబడి
7.2-8.0 క్వింటాల్/ఎకరానికి
BDN 716
కాలము
165-170
ప్రత్యేక లక్షణాలు
తడికుళ్ళు తెగులు మరియు గడ్డుతనాన్ని తట్టుకుంటుంది.మంచి నాణ్యమైన పప్పుతో అధిక దిగుబడినిచ్చే రకం.
కాలం
ఖరీఫ్
దిగుబడి
8.0-8.8 క్వింటాల్/ఎకరానికి

విత్తన మొతాదు

రకాలు
త్వరగా ప్రపక్వానికి వచ్చే రకం
ఎకరానికి 7.2-8.0 కిలో
మధ్యస్థ పరిపక్వ రకం
ఎకరానికి 4.8-6.0 కిలో
ఆలస్యంగా పరిపక్వత రకం
ఎకరానికి 1.2-1.6 కిలో

విత్తన చికిత్స

 • విత్తనాలను చికిత్స చేయండి-

  • ఇమిడాక్లోప్రిడ్ – 4 మి.లీ

  సూచనలు – పై పరిమాణాన్ని రెండు కిలోల విత్తనాలకు రెండు లీటర్ల నీటిలోకలిపి విత్తనాలను 10 నిమిషాలు ద్రావణంలో ముంచి, ఆపై 15 నిమిషాలు ఆరబెట్టండి.

  • కార్బెండజిమ్ – 2 గ్రా 

  సూచనలు – చికిత్స చేసిన విత్తనాలను 1 కిలోల విత్తనాలకు కార్బెండజిమ్ 2 గ్రాముతో మళ్లీ చికిత్స చేయాలి. విత్తన ఉపరితలంపై రుద్దడం ద్వారా విత్తనాన్ని శుద్ధి చేయండి 

  సూచనలు – ఒక కిలో విత్తనాలకు పై పరిమాణాన్ని కలపండి. పైన పేర్కొన్నవన్నీ విత్తనాలతో పాటు ఒక పాత్రలో వేసి విత్తనాలకు ఈ పొడి పదార్థాలు అంటుకునే వరకు కలపాలి. 

భూమి తయారీ

 • దున్నుతున్న పద్ధతి – నేల రకం ఆధారంగా భూమిని 1 లేదా 2 సార్లు దున్నాలి.
 • పొలం‌లో కింది వాటిని కలపండి మరియు సరైన విధంగా కుళ్ళిపోవటానికి 10 రోజులు బహిరంగ ప్రదేశంలో ఉంచండి – 

పశువుల ఎరువు – 2 టన్నులు

కంపోస్టింగ్ బాక్టీరియా – 3 కిలోలు

 • పై మిశ్రమాన్ని మట్టిపై విస్తరించి, చక్కటి దుక్కి తయారు అవ్వడానికి రోటావేటరుతో కలపండి 
 • నారు మడి తయారీ- ట్రాక్టర్ సహాయంతో 1.5 అడుగుల  దూరంలో బోదెలు మరియు సాళ్లను సిద్ధం చేయండి.

పోషక నిర్వహణ

 • ఎకరానికి 10:20:00 NPK కి.గ్రా
 • విత్తేటప్పుడు వర్తించండి-

44 కిలోల యూరియా 

250 కిలోల SSP

నీటిపారుదల

 • నీటిపారుదలకు క్లిష్టమైన దశలు-

మొక్క పెరుగుదల దశ (30-35 రోజులు)

పూత దశ (60-70 రోజులు)

కందికాయ అభివృద్ధి దశ (70-110 రోజులు)

 • నీటి పారుదల పద్దతి – వారానికి ఒకసారి (వర్షపాతం ఆధారంగా)

పరస్పర కార్యకలాపాలు

కలుపు నిర్వహణ

విత్తనాలు నాటిన 3 రోజులకు
పద్ధతి
పిచికారి
కలుపు సంహారకం పేరు
ఆట్రజిన్ లేదా పెన్డిమెథాలిన్ లేదా ఫ్లూక్లోరలిన్
కలుపు సంహారకం మోతాదు
100 గ్రాములు/ఎకరానికి లేదా400 మీ.లీ/ఎకరానికి లేదా 400 గ్రాములు/ఎకరానికి
నాటు వేసిన 3-5 రోజుల
పద్ధతి
పిచికారి
కలుపు సంహారకం పేరు
ఆక్సీఫ్లూరోఫిన్
కలుపు సంహారకం మోతాదు
100 గ్రాములు /ఎకరానికి

తెగులు మరియు పురుగు నిర్వహణ

నల్లులు
లక్షణాలు
పంట పెరుగుదల తగ్గుట,వేరుల కుళ్ళడం,మొక్క ఎండుట జరుగుతుంది
నియంత్రణ చర్యలు మొతాదు
వేప కేక్
50 కేజీ/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
కలిపి భూమి పైన చల్లాలి
విత్తన పుట్టుకతో వచ్చే వ్యాధి
లక్షణాలు
సరిలేని మొలకెత్తడం లేదా తీవ్ర సందర్భాలలో మొలకెత్తడం నిలిచిపోతుంది
నియంత్రణ చర్యలు మొతాదు
త్రైకోడెర్మా విరిడే
40 గ్రాములు /ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
విత్తన శుద్ధి
కందిపప్పు కాయ తొలుచు ఈగ
లక్షణాలు
దెబ్బతిన్న కాయలు వక్రీకృత లేదా వైకల్యంతో ఉంటాయి.ప్రభావిత ధాన్యాల ఉపరితలంపై గీతలు కనిపిస్తాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
ఇమిడాక్లోప్రిడ్
200 మీ.లీ/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
బూజు తెగులు
లక్షణాలు
సోకిన ఆకులు తెలుపు నుండి లేత బూడిదరంగు, బూజు కలిగి ఉంటాయి ఈ ఆకు మీద రంగు మారిన మచ్చలు ఒక మొక్క అంతటా అనేక ఆకుల ఉపరితలాలను విస్తరించవచ్చు మరియు కప్పపడవచ్చు.
నియంత్రణ చర్యలు మొతాదు
తడి సల్ఫర్
200గ్రాములు /ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
ఆకు ఎండు తెగులు
లక్షణాలు
పసుపు ప్రకాశంతో ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు.ముదురు గోదుమ మరియు లేత గోదుమ రంగు కలిగిన వృత్తాకార గాయాలు కనిపిస్తాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
మాన్కోజెబ్
200 గ్రాములు/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి

పంట కోత

కోత వ్యవధి
కోత వ్యవధి
180-190రోజులు
కోతల సంఖ్య
2
రెండు కోతల మధ్య వ్యవధి
20-25 రోజులకు

దిగుబడి

దిగుబడి
మొత్తం కోత యొక్క దిగుబడి
7.2-8 క్వింటాల్/ఎకరాకు

1 thought on “Tur

 1. Pingback: Tur – LeanAgri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *