Red Chilli

ఎర్ర మిరప

అంచనాలు

కోత అంచనా

15-20 క్వింటాల్/ఎకరాకు

పంట వ్యవధి అంచనా

నాటిన 200-220 రోజుల తరవాత

అంచనా పెట్టుబడి (రూపాయి)

74,997

అంచనా దిగుబడి (రూపాయి)

1,75,000

అనుకూలమైన వాతావరణ పరిస్థితులు

వాతావరణం
 •  తీపి మిరప కన్నా ఎర్రమిరప వేడి వాతావరణంలో పండించటానికి అనుకూలమైనది.
 • మిరప పంట కాంతి పరివర్తనాకాలానికి స్పందించదు (రోజు పొడవు సమయం పూత దశను కానీ పండ్ల దశను కానీ ప్రభావితం చేయలేదు).
ఉష్ణోగ్రత
 • మిరప పంట ఎదుగుదలకు 20 నుండి 30°C పగటి ఉష్ణోగ్రతలు అనుకూలమైనవి.
 • ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు అధికకాలం పాటు 15°C కన్నా తక్కువగా ఉన్నా లేదా 32°C ఎక్కువగా ఉన్నా,పంట ఎదుగుదల మరియు దిగుబడి ఘణనీయంగా తగ్గిపోతుంది.
 • రాత్రి ఉష్ణోగ్రతలు 24°C కన్నా ఎక్కువగా ఉంటే మిరప కాపు సక్రమంగా ఉండదు.
పంట నీటి అవసరం
 • సాధారణంగా సాగునీరు అందుబాటులో ఉన్న ప్రదేశాలలో పెంచాలి.
 • మిరపలో పూత దశ మరియు కాయ ఎదుగుదల దశలు ముఖ్యమైనవి,కాబట్టి ఈ దశలలో పంటకు నీరు తగినంతగా అందచేయాలి.
 • నీటి అవసరం 800-1200 mm వర్షపాతానికి సమానమైన నీరు అవసరం.

అనుకూలమైన మట్టి పరిస్థితులు

మట్టి రకము
 • మిరప పంట ఒండ్రు భూములలో మరియు భూమిలో ఎక్కువగా నీటిని పట్టుకునే సామర్ధ్యం కలిగిన నేలలలో పండిస్తారు,కానీ ఈ పంటను నీటి పారుదల సౌకర్యం కలిగిన అన్ని రకాల నేలలో కూడా పండించుకోవచ్చు. 
ఉదజని (పి. హెచ్.)
 • భూమిలో అవసరమైన ఉదజని పరిధి -5.5 మరియు 6.8.
 • అధికంగా ఆమ్లం మరియు ఆల్కలీన్భూములు మిరప పంట పండించడానికి అనుకూలమైనవి కాదు.
 • ఉదజని(pH) 5.5 కన్నా తక్కువగా ఉంటే సున్నాన్ని జోడించండి.
 • ఉదజని(pH) 6.8 కన్నా ఎక్కువగా ఉంటే జిప్సంను జోడించండి.

నాటడానికి అవసరమైనవి

ఎల్లాచీపుర్ సనమ్-S4 రకం
కాలము
150 రోజులు
ప్రత్యేక లక్షణాలు
ప్రత్యేక లక్షణం అమరావతిలో మరియు మహారాష్ట్రలో కొన్ని జిల్లాలలో పండిస్తారు. ఎరుపు రంగులో ఉండి ఘాటుగా ఉంటుంది. క్యాప్సిసిన్-0.2%
గుంటూరు సన్నం S4 రకం
కాలము
200 రోజులు
ప్రత్యేక లక్షణాలు
ఆంధ్రప్రదేశ్ లో వరంగల్,ఖమ్మం జిల్లాలలో పండిస్తారు. మిరపకాయ పై తోలు మందంగా ఉంటుంది,ఘాటుగా,ఎర్రగా ఉంటుంది. క్యాప్సిసిన్-0.226%.
మధ్యప్రదేశ్ G.T.సన్నం
కాలము
150-200 రోజులు
ప్రత్యేక లక్షణాలు
మధ్యప్రదేశ్ లో ఇండోర్,మల్కాపూర్ చిక్లి మరియు ఇలాచ్పూర్ ప్రాంతాలలో పండిస్తారు. కాయ ఘాటుగా మరియు ఎరుపు రంగులో ఉంటుంది.కోత కాలం - జనవరి నుండి మార్చి వరుకు
బ్యడగి (కడ్డీ)
కాలము
200 రోజులు
ప్రత్యేక లక్షణాలు
ఆంధ్రప్రదేశ్ లో వరంగల్,ఖమ్మం జిల్లాలలో పండిస్తారు. మిరపకాయ పై తోలు మందంగా ఉంటుంది,ఘాటుగా,ఎర్రగా ఉంటుంది. క్యాప్సిసిన్-0.226%.

నర్సరీ తయారీ విధానం

నర్సరీ తయారీ విధానం

పద్ధతి -1                

 • ఒక ఎకరం విస్తీర్ణంలో నాటడానికి  0.08 ఎకరాల నర్సరీ(3 గుంట ) నర్సరీ అవసరం అవుతుంది. 
 • 7.5 మీ పొడవు 1.2 మీ వెడల్పు 10 సెం.మీ ఎత్తు కలిగిన 6  నర్సరీ బెడ్లను తయారు చేయాలి. 
 • విత్తనాలను వరస క్రమంలో 7.5 సెం.మీ ల ఎడంగా వేసి మట్టితో కప్పివేయాలి. 
 • విత్తనాలు మొలకెత్తే వరుకు నర్సరీ బెడ్లను రోజుకు రెండుసార్లు తడపాలి మరియు విత్తనాలు మొలకెత్తిన తరువాత నుండి రోజుకొకసారి తడపాలి.  
 • నారు మొక్కలు అన్నిరకాల వాతావరణాలను తట్టుకొనేలా ఉండడానికి నాట్లు వేసే పది రోజుల ముందు నర్సరీ బెడ్లకు నీరు అందించడం తగ్గించాలి.  
 •  విత్తనాలు మొలకెత్తిన 3 రోజులు తరువాత,తడికుళ్ళు వ్యాధి రాకుండా ఉండడానికి 10 లీ నీటిలో 20 గ్రా రెడోమిల్  ను కలిపి వేరు సమీపంలో తడపాలి. 
 • విత్తనాలు వేసిన 25 రోజుల తరువాత 1 లీ నీటిలో 5 గ్రా 19:19:19+0.25గ్రా తయోమిథోక్సమ్ కలిపి పిచికారి చేయాలి.

 పద్ధతి -2

 •  పోట్రేలను (మొలకలు నాటు ట్రేలను) 1.2 కేజీ కొబ్బరిపీచుతో  ఒక్కొక్క ట్రేని నింపాలి. 
 • విత్తనశుద్ధి చేసిన విత్తనాలను పోట్రేలలో నాటాలి @ 1 విత్తనం 1 రంద్రానికి చప్పున నాటాలి.
 • విత్తనాలను కొబ్బరిపీచుతో కప్పివేయాలి ,తరువాత ఒక ట్రే మీద ఇంకొకటి పెట్టాలి మరియు విత్తనాలు మొలకెత్తే వరకు(5 రోజులు )పాలిథీన్ కవర్తో కప్పివేయాలి . 
 • 6 రోజుల తర్వాత మొలకలతో ఉన్న పోట్రేలను విడివిడిగా షేడ్నెట్ లో ఉన్న బెడ్ల మీద పెట్టాలి . 
నర్సరీ వ్యవధి
 • వ్యవధి – 35 రోజులు 
 • మొలకలకు ఆకులు వచ్చి కాండం కొద్దిగా ముదిరిన తరువాత ప్రధాన పొలంలో నాటుకోవచ్చు.
విత్తన మోతాదు
రకాలు
380- 400 గ్రామ్ / ఎకరాకు

వేరును శుద్ధిచేయు పద్ధతి:

వేరును శుద్ధిచేయు పద్ధతి:

 • చదునైన పాత్రలో 20 లీ నీటిని తీసుకోండి
 • అందులో 40 గ్రా కార్బెండజిమ్+40 మిలీ ఇమిడాక్లోప్రిడ్ ను కలపండి 

నాట్లు వేసే ముందు వేరులను 5 నిముషాల పాటు ఈ మిశ్రమం లో ముంచండి. 

 • మొక్కలు పోట్రేలలో ఉంటె, పోట్రేలను 5 నిముషాల పాటు మిశ్రమం ఉన్న పాత్రలో ముంచండి. 

భూమి తయారీ

భూమి తయారీ
 •  దున్నాల్సిన విధానం – నేల రకం బట్టి 1 లేదా 2 సార్లు దున్నాలి.
 • కిందనున్న వాటిని పొలంలో కలిపి గాలికి 10 రోజుల పాటు కుళ్లడానికి విడిచిపెట్టాలి-   

                   1)పశువుల  ఎరువు – 2 టన్నులు 

                    2) కంపోస్టింగ్ బాక్టీరియా  – 3కేజీలు 

 • పైన ఉన్న ఎరువులను భూమి మీద చల్లి రోటావేటర్ సాయంతో మట్టిలో కలిపి వేయండి దీని వల్ల మెత్తటి దుక్కి తాయారు అవుతుంది. 
బెడ్స్ తయారుచేయు విధానం
 • ప్రధాన పొలం లో పంట బోదెలు – కాలువలు తయారి – 75 సెమీ లేదా 60 సెమీ దూరం కలిగిన బోదెలు – కాలువలను ట్రాక్టర్ సహాయంతో తయారుచేసుకోవాలి. 
నాట్లు వేయడం

పంట బోదెలు మీద ఒక్కొక్క మొక్కకు 60 సెమీ దూరం ఉంచి నారు మొక్కలను నాటండి

సార్ల మధ్య దూరము మరియు మొక్క జనాభ

రకాలు
సార్లకు మధ్య దూరము
1.9అడుగులు
మొక్కల మధ్య దూరము
0.9అడుగులు
మొక్కల సంఖ్య
19,555
హైబ్రీడ్స్ రకాలు
సార్లకు మధ్య దూరము
1.5అడుగులు
మొక్కల మధ్య దూరము
1.5అడుగులు
మొక్కల సంఖ్య
19,555

పోషక నిర్వహణ

 • 40:20:20 కేజీ యన్.పి.కె ఒక ఎకరానికి
 • విత్తనాలు నాటేటప్పుడు ఒక ఎకరానికి –                 

యూరియా – 44 కేజీ

యస్.యస్.పి – 122 కేజీ 

యం.ఒ.పి – 34 కేజీ

 •  నాట్లు వేసిన 30 రోజులకు – 22 కేజీ యూరియా 
 •  నాట్లు వేసిన 45 రోజులకు – 22 కేజీ యూరియా

నీటిపారుదల

 • బిందు సేధ్యానికి – రోజు విడిచి రోజు  నీటిని అందించండి 
 •  నీటి పారుదల పద్ధతికి – వారానికి ఒకసారి (వర్షపాతాన్ని బట్టి )           
 • వేసవి కాలంలో – 5 నుండి 6 రోజులకొకసారి 
 •  ప్రతి కోత తరువాత ఒకసారి పంటకి నీటిని అందించాలి.

పరస్పర కార్యకలాపాలు

కలుపు నిర్వహణ

నారు నాటిన 3 రోజుల తరవాత
పద్ధతి
పిచికారి
కలుపు సంహారకం పేరు
ఆట్రజిన్ 50WP లేదా పెన్డిమెథాలిన్
మొతాదు
ఎకరానికి 100 గ్రాములు లేదా ఎకరానికి 400 మి.లీ
నారు నాటిన 30 రోజుల తరవాత
పద్ధతి
పిచికారి
కలుపు సంహారకం పేరు
ఆక్సీఫ్లూరోఫేన్
మొతాదు
ఎకరానికి 100 మి.లీ.

పెరుగుదల నియంత్రకాలు

 • పూత పెంచడానికి నాట్లు వేసిన 20,40,60 రోజులకు ట్రైఎకన్టనోల్ @ 1.25 మిలీ ఒక లీ నీటిలో కలిపి పిచికారి చేయండి.
 • నాట్లు వేసిన 60 మరియు 90 రోజులకు పూత రాలడం తగ్గించడానికి మరియు కాపు పెంచడానికి నాఫ్తలిక్ అసిటిక్ యాసిడ్ 2 మిలీ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయండి.

తెగులు మరియు పురుగు నిర్వహణ

కాండం కుళ్ళు తెగులు
లక్షణాలు
మొదట ఆకులు పసుపురంగులోకి మారుతాయి, తరవాత పైభాగంలో ఉన్న ఆకులు ఎండుతాయి త్వరలో మొక్క ఎండుతుంది, అలాగే పైకి మరియు క్రిందకి ఆకులు ముడుచుకుంటాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
కార్బెండజిమ్
200 గ్రామ్ / ఎకరాకు
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి వేరు ప్రదేశంలో తడపాలి
నేల వలన కలిగే వ్యాధులు
లక్షణాలు
మొక్కలు త్వరగా చిట్లిపోయి ఎండిపోతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
త్రైకోడెర్మా విరిడే
40 గ్రామ్ / ఎకరాకు
సుడోమోనాస్ ఫ్లూరోఎసెంస్
40 గ్రామ్ / ఎకరాకు
నియంత్రణ చర్య పద్ధతి
చోటు మార్చి నాటునప్పుడు నీటిలో ముంచాలి.
బూజు తెగులు
లక్షణాలు
వ్యాధి సోకిన ఆకులు బూడిద రంగు లేదా, తెల్ల రంగు కలిగిన బూజు పాచెస్ కలిగిఉంటాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
తడి సల్ఫర్
200 గ్రామ్ / ఎకరాకు
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
రసం పీల్చే పురుగు
లక్షణాలు
ఆకులపైనా తెల్లని మచ్చలు. ఆకులూ పైకి ముడుచుకుపోతాయి. చిన్న పురుగులు ఆకులపైనా మరియు కాండముపైన సమికుడుతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
తయోమిథోక్సమ్
100 గ్రామ్ / ఎకరాకు
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
తడి కుళ్ళు
లక్షణాలు

దెబ్బతిన్న మొలకలు చాలా సన్నగా కనిపిస్తాయి.
మొక్కలు త్వరగా చిట్లిపోయి ఎండిపోతాయి.
మొలకలు ఒకదాని మీద ఇంకోటి దొర్లి నాశనమవుతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
మితలాస్జిల్
250 మీ.లి.
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి వేరు ప్రదేశంలో తడపాలి
చచ్చు తెగులు
లక్షణాలు
ఆకుల మొదలు నుంచి అంచెలంచేలుగా పసుపురంగులోకి మారడం మరియు చనిపోవడం జరుగుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
మాన్కోజెబ్
400 గ్రామ్ / ఎకరాకు
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
పండు తొలుచు పురుగు
లక్షణాలు
ఉచ్చులు లో ఫేర్మోన్ క్రిమిని ఆకర్షించి మరియు సంహరిస్తుంది. పండ్లమీద రంద్రాలు చేస్తాయి. కొమ్మలకి రంద్రాలు చేసి మరియు పండ్లులో విసర్జనను నింపుతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
తయోమిథోక్సమ్
200 మీ.లి./ఎకరాకు
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి

పంట కోత

కోత వ్యవధి
కోత వ్యవధి
200 నుండి 220 రోజులు
కోతల సంఖ్య
5 లేదా 6
రెండు కోతల మధ్య వ్యవధి
10 రోజులు

దిగుబడి

దిగుబడి
ప్రతి కోత యొక్క దిగుబడి
ఎకరానికి 1. 5 -2 క్వింటాల్
మొత్తం కోత యొక్క దిగుబడి
ఎకరానికి 15-20 క్వింటాల్.

1 thought on “Red Chilli

 1. Pingback: Red Chilli – LeanAgri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *