Mango

మామిడి

అంచనాలు

కోత అంచనా

8000 పండ్లు/చెట్టుకు (అల్ఫాన్సో)

పంట వ్యవధి అంచనా

30 – 40 సంవత్సరాలు

అంచనా పెట్టుబడి (రూపాయి)

37,447

అంచనా దిగుబడి (రూపాయి)

1,60,000

అనుకూలమైన వాతావరణ పరిస్థితులు

వాతావరణం
 • మామిడి తీవ్రమైన మంచులో నిలబడదు , ముఖ్యంగా మొక్క మొదటి దశలో ఉన్నపుడు  తట్టుకోలేదు. పూతకి ముందు పొడి వాతావరణం మంచింది.
 • పూత దశ లో వర్షం పడటం ద్వారా పరాగసంకర్పపు చర్యకు ఆటంకం కలిగిస్తుంది , ఏదేమైనా, పండ్ల అభివృద్ధి సమయంలో  వర్షం మంచిది కానీ భారీ వర్షాలు పండ్లు పండడానికి హాని కలిగిస్తాయి .
 • బలమైన గాలులు మరియు తుఫాను వలన అధిక పండ్ల రాలిపోడానికి కారణమవుతాయి.
ఉష్ణోగ్రత
 • అధిక తేమతో పాటు పెరుగుతున్న కాలంలో మామిడికి అనువైన ఉష్ణోగ్రత పరిధి 24-30 ° C ఉంటుంది.
 •  అధిక ఉష్ణోగ్రత మామిడికి అంత హానికరం కాదు, కానీ తక్కువ తేమ మరియు అధిక గాలుల వలన చెట్టును ప్రతికూలంగా  ప్రభావితం చేస్తుంది.
 •  శీతాకాలంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 5°C కంటే ఎక్కువ ఉండాలి.
 • చెట్లు పూర్తి పూత దశలో ఉన్నపుడు తక్కువ ఉష్ణోగ్రతల వలన పరిపక్వత కానీ పండ్లు పసుపు రంగులోకి మారిపోతాయి , ఎక్కువ పరిపక్వత కానీ పండ్ల వలన దిగుబడి తగ్గుతుంది.
పంట నీటి అవసరం
 • నీటి అవసరం-900-1100  మి.మీ వర్షపాతానికి సమానమైన నీరు అవసరం.

అనుకూలమైన మట్టి పరిస్థితులు

మట్టి రకము
 • ఒండ్రు నేలలు , మంచి నీటి పారుదల నేలలు ,గాలి వెసులుబాటు ,లోతైన నేలలు (2-2.5 మీటర్ ) 
 • మామిడి సాగుకు సేంద్రీయ పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.
 • సక్రమమైన ఎరువులు భూమికి ఇస్తే , తేలిక నెలలో కూడా దీని దీనిని పెంచవచ్చ.  
 • చౌడు భూములు మరియు ఉప్పు నెలలు నివారించాలి. 
 • మామిడి అధిక ఉప్పు నేలలను తట్టుకోలేదు.
ఉదజని (పి. హెచ్.)
 • పరిధి 5.5 నుండి 7.5 అవసరం.
 • ఉదజని (PH) <5.5 అయితే సున్నంను  జోడించండి.
 • ఉదజని (PH)>7.5 అయితే జిప్సంను జోడించండి.

నాటడానికి అవసరమైనవి

అల్ఫోన్సో (హపస్)
ప్రత్యేక లక్షణాలు
మంచిరుచి, రంగు మరియు నిల్వ ఉంటుంది, సీజన్‌లో ప్రారంభలోనే పండ్లు, ఎగుమతికి మంచివి, సక్రమమైన కాపు కలిగి ఉండదు, ఎన్ని ప్రక్రియలు జరిగిన పండు సువాసన కలిగి ఉంటుంది, మెత్తటి కణజాలం కలిగి ఉండచ్చు.
దిగుబడి
150-250 పండ్లు/చెట్టుకు
రత్న
ప్రత్యేక లక్షణాలు
ప్రతి సంవత్సరం పెద్ద పండ్ల కాపు కలిగి ఉంటుంది.
దిగుబడి
250-300 పండ్లు/చెట్టుకు
సింధు
ప్రత్యేక లక్షణాలు
ఎక్కువ గుజ్జు, సక్రమమైన పండ్ల కాపు, పండ్ల ఉపరితలంపై ఆకర్షణీయమైన ఎరుపు రంగు, మధ్యస్థు పరిమాణం కలిగి పండ్లు, మెత్తటి కణజాలం లేకుండా ఉంటాయి.
దిగుబడి
200-250 పండ్లు/చెట్టుకు
కేసర్
ప్రత్యేక లక్షణాలు
ఎక్కువ పండ్ల దిగుబడి, అల్ఫోన్సో కంటే ఎక్కువ దిగుబడి, తినడానికి అనుకూలమైనవి.
దిగుబడి
400-500 పండ్లు/చెట్టుకు

వేరులు శుద్ధి చేయు విధానం

 • సమానంగా ఉన్న టబ్బులో 30 లీటర్ల  నీటిని తీసుకోండి.
 • అందులో 60 గ్రాముల కార్బెండజిమ్ + 60 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ కలపండి.
 • నాటడానికి ముందు మొక్కల వేరులను  ద్రావణంలో ముంచండి.

భూమి తయారీ

భూమి తయారీ
 • మునుపటి పంట యొక్క శిధిలాలు మరియు చెత్తను తొలగించండి.
 • మే నెలలో వర్షాలు ప్రారంభం అయ్యే ముందు 1 x 1 x 1 మీటర్ పరిమాణంలో గుంటలు తవ్వండి. 
 • 3 టన్నులు పశువుల ఎరువు మరియు 3 కిలోల కంపోస్టింగ్ బాక్టీరియా కలిపి ప్రతి గుంటలో 5 కిలోల చొప్పున సమానంగా వెయ్యండి.

నాటడం

 • అంటుకట్టుట వంటి అనేక పద్ధతులను ఉపయోగించి మొక్కలను సాధారణంగా , సకియా ఉత్పత్తి ద్వారా పెంచుతారు.
 • రుతుపవనాల ప్రారంభంలో , సిద్ధంగా ఉన్న అంటుకట్టును గుంటలో నాటండి.
 • పొలంలో నాటడానికి ముందు ప్లాస్టిక్ సంచిని తొలగించండి.
 • రసాయన చికిత్స: చెదపురుగుల నుండి మొలకలను రక్షించడానికి ,100 గ్రాముల 2% మిథైల్ పారాథియాన్ లేదా 10% కార్బరిల్ పౌడర్‌ను గుంటలో కలపండి.

నాటు సమయం

 • జూన్ నుంచి సెప్టెంబర్ 

నాటడం

 • మామిడిని విత్తనం ద్వారా పెంచవచ్చు , సకియా ఉత్పత్తి ద్వారా పెంచుతారు
 • అంటుకట్టుట వంటి అనేక పద్ధతులను ఉపయోగించి మొక్కలను సాధారణంగా , సకియా ఉత్పత్తి ద్వారా పెంచుతారు.
 • రుతుపవనాల ప్రారంభంలో , సిద్ధంగా ఉన్న అంటుకట్టును గుంటలో నాటండి.
 • పొలంలో నాటడానికి ముందు ప్లాస్టిక్ సంచిని తొలగించండి.
 • రసాయన చికిత్స: చెదపురుగుల నుండి మొలకలను రక్షించడానికి ,100 గ్రాముల 2% మిథైల్ పారాథియాన్ లేదా 10% కార్బరిల్ పౌడర్‌ను గుంటలో కలపండి.

పోషక నిర్వహణ

 • మొదటి సంవత్సరం – పశువుల ఎరువు 1 కేజీ + 120:150:50 గ్రాములు  NPK/ మొక్కకి 

యూరియా – 260 గ్రాములు. 

సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ( ssp ) – 920 గ్రాములు.

ఎం ఓ పి -85 గ్రాములు. 

 • రెండొవ సంవత్సరం – పశువుల ఎరువు 2 కేజీలు +  240:300:100 గ్రాములు NPK/ మొక్కకి

యూరియా – 520 గ్రాములు. 

సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ( ssp )- 1845  గ్రాములు. 

  ఎం ఓ పి 167 గ్రాములు. 

 •    మూడోవ సంవత్సరం – పశువుల ఎరువు 3  కేజీలు + 360:450:150 గ్రాములు NPK/ మొక్కకి

యూరియా -780  గ్రాములు. 

సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ( ssp )- 2767  గ్రాములు. 

  ఎం ఓ పి – 250  గ్రాములు. 

 •   నాల్గొవ సంవత్సరం –  పశువుల ఎరువు 4 కేజీలు +   480:600:20 గ్రాములు NPK/ మొక్కకి

 యూరియా -1040  గ్రాములు. 

సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ( ssp )- 3690 గ్రాములు. 

 ఎం ఓ పి -334   గ్రాములు.     

 •  ఐదొవ సంవత్సరం –   పశువుల ఎరువు 5 కేజీలు +  600:750:250 గ్రాములు NPK/ మొక్కకి

 యూరియా -1300  గ్రాములు. 

సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ( ssp )- 4612 గ్రాములు. 

 ఎం ఓ పి – 418   గ్రాములు.    

 •   ఆరొవ  సంవత్సరం –     పశువుల ఎరువు 6 కేజీలు + 720:900:300  గ్రాములు NPK/ మొక్కకి

 యూరియా -1560  గ్రాములు. 

సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ( ssp )- 5535  గ్రాములు.

 ఎం ఓ పి – 500   గ్రాములు. 

 •   ఎడొవ సంవత్సరం –  పశువుల ఎరువు 7 కేజీలు +  840:1050:359 గ్రాములు NPK/ మొక్కకి

 యూరియా – 1830  గ్రాములు. 

సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ( ssp )- 6460  గ్రాములు. 

 ఎం ఓ పి – 600   గ్రాములు. 

 • ఎనిమిదొవ  సంవత్సరం –  పశువుల ఎరువు 8  కేజీలు + 960:1200:400 గ్రాములు NPK/ మొక్కకి

 యూరియా –  2085 గ్రాములు. 

సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ( ssp )-7380  గ్రాములు. 

 ఎం ఓ పి – 668  గ్రాములు. 

 • తొమ్మిదొవ సంవత్సరం –  పశువుల ఎరువు 9 కేజీలు +   1080:1350:450 గ్రాములు NPK/ మొక్కకి

          యూరియా – 2345  గ్రాములు. 

               సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ( ssp )-8300  గ్రాములు. 

            ఎం ఓ పి -750 గ్రాములు. 

 • పదోవ  సంవత్సరం –  పశువుల ఎరువు 9  కేజీలు + 1200:1500:500 గ్రాములు NPK/ మొక్కకి

          యూరియా –  2600 గ్రాములు. 

               సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ( ssp )-9225  గ్రాములు. 

            ఎం ఓ పి – 835  గ్రాములు.

గమనిక :  వర్షం పడినప్పుడు పైన మొత్తం పశువుల ఎరువులు మరియు సగం మోతాదు  NPK , వెయ్యాలి , మిగతా NPK మోతాదు సెప్టెంబర్ -అక్టోబర్ నెలలో వెయ్యాలి .

నీటిపారుదల

 • మొదటి సంవత్సరం – పొడి కాలంలో 2-3 రోజుల విరామంలో సాగునీరు ఇవ్వండి.
 • రెండు నుంచి ఐదు సంవత్సరాలు – 4-5 రోజుల విరామంలో నీటి పారుదల ఇవ్వండి.
 • ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాలు /కాపు నుంచి పండ్ల తయారీ వరకు – 10-15 రోజుల విరామంలో నీటి పారుదల ఇవ్వండి.
 • మొత్తం కాపు వచ్చినా తర్వాత – పండు నిర్మాణం అయినా తర్వాత 2-3 విరామంలో సాగునీరు ఇవ్వండి.

పరస్పర కార్యకలాపాలు

కలుపు నిర్వహణ

విత్తనాలను నాటిన 10 రోజుల తర్వాత
పద్ధతి
పిచికారి
కలుపు సంహారకం పేరు
గ్లైఫొసాట్
మొతాదు
500 మి.లీ./ఎకరానికి
విత్తనాలను నాటిన 30 రోజుల తర్వాత
పద్ధతి
Spray
కలుపు సంహారకం పేరు
పరాఖ్వత్ లేదా అత్రజిన్
మొతాదు
ఎకరానికి 500 గ్రాములు లేదా ఎకరానికి 400 గ్రాములు

పెరుగుదల నియంత్రకాలు

 • తయారు కానీ పండ్లు రాలిపోకుండా ఉండడానికి NAA @ 20 ppm పూత సమయంలో పిచికారీ చెయ్యాలి.
 • ఫిబ్రవరి నెలలో పూత రాకపోతే 0.5% యూరియా (5 గ్రా / లి) లేదా 1% పొటాషియం నైట్రేట్ (10 గ్రా /లి) పిచికారీ చెయ్యాలి.
 • పండ్ల నిర్మాణం  పెంచడానికి మరియు పండు రాలుట తగ్గించడానికి 2% KNO3 ఆవగింజ పరిమాణంలో పిచికారీ చెయ్యాలి.
 • సెప్టెంబర్ లో మొదటి 15 రోజులలో పూత రాని చెట్లులకు పాక్లోబుట్రాజోల్ @ 10 గ్రా , ఒక్కో చెట్టుకి పిచికారీ చెయ్యడం ద్వారా మంచి పూత మరియు పండ్లు కాపుని పెంచుతుంది. 

తెగులు మరియు పురుగు నిర్వహణ

నల్ల కొస మరియు లోపలిభాగం కుళ్ళడం
లక్షణాలు
పిందెలు కొస దగ్గర నల్లగా మరియు గట్టిగా మారుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
బొరాక్స్
ఎకరానికి 300 గ్రా
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
పండ్లు రాలడం
లక్షణాలు
పిందెలుగా ఉన్నప్పుడే పండ్లు రాలిపోతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
నాప్తలీన్ అసిటిక్ యాసిడ్
ఎకరానికి 300 మిలీ
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
ఎండు తెగులు మరియు చచ్చు తెగులు
లక్షణాలు
పూత నిర్మాణలోపం, పువ్వు నల్లబడటం
నియంత్రణ చర్యలు మొతాదు
కాపర్ఆక్సీక్లోరైడ్
ఎకరానికి 300 గ్రా
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
చచ్చు తెగులు
లక్షణాలు
పైన నుండి క్రిందకి కొమ్మలు ఎండిపోతాయి మరియు ఆకులు ప్రత్యేకంగా ముదిరిన ఆకులు రాలిపోతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
కాపర్ఆక్సీక్లోరైడ్
ఎకరానికి 300 గ్రా
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
ఎర్ర తుప్పు తెగులు
లక్షణాలు
తుప్పు పట్టినట్టు మచ్చలు ఆకులపై కనిపిస్తాయి, ప్రారంభంలో వృత్తాకారంగా కనిపిస్తాయి, మరియు ఎలువెత్తుగా కనిపిస్తాయి తరువాత కలిసిపోయి అసమానమైన మచ్చలు ఏర్పరుస్తాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
బోర్డాక్స్ మిశ్రమం
ఎకరానికి 300 గ్రా
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
యాన్త్రక్నోజ్ ఆకు మచ్చ తెగులు
లక్షణాలు
ఆకు ఉపరితలంపై అస్పష్టమైన గోధుమ రంగు మచ్చలు.
నియంత్రణ చర్యలు మొతాదు
కాపర్ఆక్సీక్లోరైడ్
ఎకరానికి 300 గ్రా
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
బూజు తెగులు
లక్షణాలు
ఆకులు మరియు కాండం మీద తెలుపు బూజు పెరుగుదల.
నియంత్రణ చర్యలు మొతాదు
తడి సల్ఫర్
ఎకరానికి 300 గ్రా
నియంత్రణ చర్య పద్ధతి
Drench Near root zone in water
సుడి దోమ
లక్షణాలు
డింభక దశ పురుగులు లేత మొక్క కాండంలోకి దూరి మధ్యలో ఉన్న కాండం ఎండిపోతుంది
నియంత్రణ చర్యలు మొతాదు
తయోమిథోక్సమ్
ఎకరానికి 300 గ్రా
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
ఆకు గూడు కట్టు పురుగు
లక్షణాలు
ప్రారంభంలో గొంగళి పురుగులు గుంపుగా లేత ఆకులపై ఆధారపడతాయి. తరువాత అవి లేత రెమ్మలు మరియు ఆకులని తింటాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
క్వినాల్ఫోస్
ఎకరానికి 300 మిలీ
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
పండు ఈగ
లక్షణాలు
గుడ్డులో ఉన్న పురుగులు పండుయొక్క లోపలి పదార్థముపై ఆధారపడి పండు కుళ్లిపోవడానికి కారణం అవుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
లింగాకర్షక బుట్టలు
ఎకరానికి 5
నియంత్రణ చర్య పద్ధతి
పొలంలో పెట్టాలి
పిండి నల్లి
లక్షణాలు
బంకలాంటి పదార్థము వదలడం వల్ల మసిలాంటి బూజు పడుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
క్లోరోపైరిపోస్
మొక్కకు 0.5 మిలీ
నియంత్రణ చర్య పద్ధతి
గుంత చుట్టూ ఉన్న వలయాకారములో కలపాలి
తేనె మంచు పురుగు
లక్షణాలు
భారీ రంద్రాలు పెట్టడం వల్ల మరియు నిరంతరము సారం కారడం వల్ల కణజాలము ముడతలు పడడం మరియు ఎండిపోవడం జరుగుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
డైమిథోయేట్
ఎకరానికి 450 మిలీ
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి

పంట కోత

కోత వ్యవధి
కోత వ్యవధి
పండు రకం మీద ఆధారపడి కోత ఐదు సంవత్సరాల తర్వాత మొదలు అవుతుంది
మామిడి చెట్టు యొక్క ఉత్పాదక కాలం
30-40 సంవత్సరాలు

దిగుబడి

దిగుబడి
5 - 8 సంవత్సరాలలో
200-300 పండ్లు / చెట్టుకి
9వ సంవత్సరంలో / ఆపై
300-500 పండ్లు / చెట్టుకి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *