Green Chilli

పచ్చిమిర్చి

అంచనాలు

కోత అంచనా

30 క్వింటాల్ / ఎకరా

పంట వ్యవధి అంచనా

నాటు వేసిన 70-150 రోజులకు

అంచనా పెట్టుబడి (రూపాయి)

61,805 

అంచనా దిగుబడి (రూపాయి)

1,42,500

అనుకూలమైన వాతావరణ పరిస్థితులు

వాతావరణం
 • పువ్వు మరియు కాయ కాసే సమయమున భారీ వర్షం మరియు మేఘావృత వాతావరణం వలన పూలు మరియు పిందెలు రాలిపోతాయి. 
 • ఎక్కువ తేమశాతం వలన కాయలు కుళ్లిపోతాయి. 
 • ఎక్కువ కాంతి తీవ్రత వలన కాయ రంగు మారడం ఆలస్యమవుతుంది.
ఉష్ణోగ్రత
 • 10℃ కంటే  తక్కువ ఉష్ణోగ్రత ఉంటె మొక్క ఎదుగుదల తగ్గుతుంది. 
 • మొదటి దశలో 30℃ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటె వేరు పెరుగుదల తగ్గుతుంది. 
 • ఒకవేల ఉష్ణోగ్రత 37°C కన్న ఎక్కువ ఉంటె కాయ పెరుగుదల ప్రతికూలంగా ప్రభావం చూపు. 
 • 20-25°C ఉష్ణోగ్రత మిరప పంట పండించడానికి సరైన వాతావరణం.

   

పంట నీటి అవసరం
 • సాధారణంగా సాగునీటి ప్రాంతాల్లో పెరుగుతుంది.      
 • మిరపలలో పూత మరియు పండ్ల అభివృద్ధి చాలా ముఖ్యమైన దశలు, నీరు తప్పకుండ అందించాలి. 
 • నీటి అవసరం: 800-1200 మిల్లీమీటర్ల వర్షపాతంకి సమానమైనది

అనుకూలమైన మట్టి పరిస్థితులు

మట్టి రకము
 • మంచి నీటిని పట్టుకొనే  సామర్థ్యంతో ఇసుక రేగడ నేల

ఉదజని (పి. హెచ్.)
 • అవసరమైన పరిధి: 6.0-7.0
 • పెరుగుతున్న మిరపకాయలకు బలమైన ఆమ్లం మరియు ఉప్పు నేలలు సరిపోవు.
 • పి హెచ్  <6.0 ఉంటే సున్నం జోడించండి
 • పి హెచ్  > 7.0 ఉంటే జిప్సం చేర్చండి

నాటడానికి అవసరమైనవి

సూపర్ మహా జ్వాలా (హైబ్రిడ్)
కాలము
70-75 రోజులకు
ప్రత్యేక లక్షణాలు
మంచి దిగుబడి ఇచ్చేది, దూరరావణాలకు మంచి నాణ్యత ఉంచ్చుతుంది, సారం పీల్చే పురుగులకు లోబడదు.
బుతువు
ఖరీఫ్ & రబీ & వేసవి
దిగుబడి / ఎకరాకు
100 - 120 క్వింటాల్
నావల్ (హైబ్రిడ్
కాలము
75 రోజులకు
ప్రత్యేక లక్షణాలు
గ్రీన్ హౌస్ మరియు నెట్ హౌస్ లో పెంచడానికి వీలుగా ఉంటుంది. మంచి నాణ్యత కలిగిన కాయలు
బుతువు
ఖరీఫ్ & రబీ

నర్సరీ తయారీ విధానం

నర్సరీ తయారీ విధానం

పద్ధతి -1:

 •  చోటు మర్చి నాటుదానికి 1 ఎకరానికి 0.08 ఎకరం నర్సరీ అవసరం. 
 • దానికి 7.5 మీ. పొడవు X 1.2 మీ. వెడల్పు X 10 సెం.మీ. ఎత్తు గల 6 బెడ్స్ తయారుచేయాలి. 
 • 7.5 సెం.మీ. దూరంలో విత్తనాలు నాటి మట్టితో కప్పాలి. 
 • మొలకలు వచ్చేంత వరకు రోజుకు రెండు సార్లు, మొలకలు వచ్చిన తరవాత ఒక సారి నీళ్లు పెట్టాలి. 
 • చోటు మార్చి నాటుకు 10 రోజులు ముందు నీటిని అందించడం తగ్గించి మొలకలను గట్టి పరచాలి. 
 • మొలకెత్తిన 3 రోజులు తరవాత రీడొమిల్ @ 20 గ్రాములు  10 లీటర్ నీటిలో కలిపి వేరు దగ్గర అందించాలి దీనివలన మొలకల కుళ్ళు తెగులు నివారించచ్చు. 
 • నాటు నాటిన 25 రోజులకి 19:19:19 @ 5 గ్రాములు  మరియు థియోమిథాక్సమ్ @ 0. 25 గ్రామ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. 

పద్ధతి -2:

 • ప్రోట్రే (మొలకలు నాటు ట్రే) ని 1.2 కేజీ కోకోపిట్తో ఒకొక్క ట్రేని నింపాలి. 
 • విత్తన శుద్ధి చేసిన విత్తనాలు  ప్రోట్రే లో నాటాలి @ 1 విత్తనం ఒక రంద్రంలోకి చొప్పున. 
 • మొత్తం విత్తనాలిని  పీట్ తో కప్పండి ,తర్వాత ఒక్కో ట్రే మీద ఒకటి పెట్టి మొలకైతే వరకు  మొత్తం పాలిథిన్తో కప్పండి (నాటు వేసిన 5 రోజులు తరవాత)
 • 6 రోజులు తరవాత మొలకలు వచ్చిన ప్రోట్రే లని విడివిడిగా నీడలో  ఉన్న బెడ్స్ పైన ఉంచాలి.
నర్సరీ వ్యవధి
 •  వ్యవధి – 35 రోజులు
 • మొలకలకు  ఆకులు వచ్చి కాండం కొద్దిగా ముదిరిన తరవాత చోటు మర్చి నాటవచ్చు.
విత్తన మోతాదు
రకాలు
1 ఎకరానికి నాటడం కోసం 380-400 గ్రాముల గింజలు కావాలి
హైబ్రీడ్స్ రకాలు
1 ఎకరానికి నాటడం కోసం 100-120 గ్రాముల గింజలు కావాలి.

విత్తన శుద్ధి

 క్రింది వాటితో శుద్ధి చేయండి :

 

ఇమిడక్లోప్రిడ్ – 4 మిల్లి లీటర్లు

 

సూచనలను: 1 కేజీ విత్తనాలకు పైనఉన్న మిశ్రమాన్ని 2 లీటర్లు నీటిలో కలిపి విత్తనాలను 10 నిమిషాలు ముంచి నీడలో 15 నిమిషాలు ఆరబెట్టాలి.

 

 కార్బెండజిమ్- 2 గ్రాములు.

 

సూచనలను: అలాగే పైన శుద్ధి చేసిన మిశ్రమాన్ని మళ్ళీ   కార్బెండజిమ్- 2 గ్రాములతో శుద్ధి చెయ్యాలి.   విత్తన ఉపరితులం పై రుద్దలి 

భూమి తయారీ

భూమి తయారీ
 • ద్దున్నాల్సిన విధానం- నేల రకంబట్టి 1 లేదా 2 సార్లు ద్దున్నాలి.  
 • పెడా ఎరువు – 2 టన్నులు  మరియు కంపోస్టింగ్ బాక్టీరియా (ఎరువు తయారు అవుటకు సహాయపడే) 3కేజీ కలిపి గాలికి10 రోజులు కుళ్లడానికి విడిచిపెట్టాలి. 
 • పైన ఉన్న మిశ్రమాన్ని నేల మొత్తం జల్లి రోటవేటర్,సాయంతో నేల మొత్తం ద్దున్నాలి, దీనివలన భూమి సారం పెరుగుతుంది.
బెడ్స్ తయారుచేయు విధానం
 • ట్రాక్టర్ సాయంతో 75 సెం.మీ. లేదా 60 సెం.మీ. ఎత్తు- పళ్లం  తో కూడిన పొలాన్ని తయారుచేయాలి.

ప్లాస్టిక్ కప్పడం

 • డ్రిప్ సాగుకి ప్లాస్టిక్ మల్చింగ్ (ప్లాస్టిక్ కవర్ కప్పడం) అవసరము. 
 • కాలువ సాగుకి ప్లాస్టిక్ మల్చింగ్ అవసరంలేదు.

సార్ల మధ్య దూరము మరియు మొక్క జనాభ

రకాలు
సార్లకు మధ్య దూరము
1.9 అడుగులు
మొక్కల మధ్య దూరము
1.9 అడుగులు
మొక్కల సంఖ్య
11111
హైబ్రీడ్స్ రకాలు
సార్లకు మధ్య దూరము
2.4 ft
మొక్కల మధ్య దూరము
1.9 ft
మొక్కల సంఖ్య
8888

వేరు ముంచు చికిత్స

 •  చదునైన పాత్రలో 20 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. 
 • అందులో 40  గ్రాములు కార్బెన్ద్రజిన్ మరియు 40 మిల్లి లీటర్లు  ఇమిడాక్లోప్రిడ్ కలపాలి. 
 • చోటు మర్చి నాటువేసే ముందు వేరు అందులో ముంచాలి. 
 • మొలకలు ప్రోట్రేలో ఉంటె ప్రోట్రేని పాత్రలో 5 నిమిషాలు ముంచాలి. 

నారు నాటడం

 • మొలకలని 60 సెం.మీ. దూరంలో ఉన్న సార్లుపై నాటాలి.

 

పోషక నిర్వహణ

 • ఎకరాకు 40:20:20 కేజీ  నాత్రజిన్ బస్పరం మరియు పొటాషియం వెయ్యాలి. 
 • నాటు వేసేటప్పుడు ఎకరాకు 44 కేజీ యూరియా మరియు 122 కేజీ యస్.యస్.పి మరియు 34 కేజీ యమ్.ఓ.పి  వెయ్యాలి. 
 • నాటు వేసిన 30 రోజులు తరవాత 22 కేజీ యూరియా వెయ్యాలి.  

 

నీటిపారుదల

 • డ్రిప్ ద్వారా అయితే రోజు మర్చి రోజు నీటిని అందించాలి. 
 • కాలువ ద్వారా అయితే 7 రోజుల ఒకసారి. 
 • వేసవి కాలంలో  5-6 రోజుల ఒకసారి.
 • మిరపకాయ ప్రతి కోత తర్వాత ఒక నీటిపారుదల అందించాలి

 

పరస్పర కార్యకలాపాలు

కలుపు నిర్వహణ

నాటు వేసిన 3 రోజుల తర్వాత
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
అత్రజిన్ 50WP లేదా పెండిమీథలిన్
కలుపు మందు పరిమాణం
100 గ్రాములు/ ఎకరానికి 400 మిల్లి లీటర్లు/ ఎకరానికి
నాటు వేసిన 30 రోజుల తర్వాత
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
ఆక్సీఫ్లూరోఫిన్
కలుపు మందు పరిమాణం
400 మిల్లి లీటర్లు/ ఎకరానికి

పెరుగుదల నియంత్రకాలు

 • మంచి పూతకు 1 లీటర్ నీటిలో 1.25 మిల్లి లీటర్లు త్రిఏకాంతనోల్ కలిపి నాటు వేసిన తరవాత 20, 40, 60, రోజులకి పిచికారీ చెయ్యాలి.
  పూత రాలడం తగ్గించి మరియు ఎక్కువ కాయలకి ఎన్ ఏ ఏ 2 మిల్లి లీటర్లు, లీటర్ నీటిలో కలిపి నాటు వేసిన తరవాత 60 మరియు 90 రోజులకి పిచికారీ చెయ్యాలి.
నియంత్రణ చర్య పద్ధతి
నీళ్ళల్లో కలిపి డ్రిప్ ప్రక్రియ ద్వారా వేయండి

తెగులు మరియు పురుగు నిర్వహణ

टमाटर की खेती के रोग - मर रोग
తడి కుళ్ళు
లక్షణాలు
దెబ్బతిన్న మొలకలు చాలా సన్నగా కనిపిస్తాయి.మొక్కలు త్వరగా చిట్లిపోయి ఎండిపోతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
కాపర్ఆక్సీక్లోరైడ్
250.0 గ్రాములు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి వేరు ప్రదేశంలో తడపాలి
రసం పీల్చే పురుగులు
లక్షణాలు
ఆకుల మడత.ఆకులపైనా తెల్లని మచ్చలు.ఆకులూ పైకి ముడుచుకుపోతాయి.చిన్న పురుగులు ఆకులపైనా మరియు కాండముపైన సమికుడుతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
తయోమిథోక్సమ్
100.0 గ్రాములు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
powdery mildew disease of chilli plant
బూజు తెగులు
లక్షణాలు
ఆకులు మరియు కాండం మీద తెలుపు బూజు పెరుగుదల.
నియంత్రణ చర్యలు మొతాదు
తడి సల్ఫర్
200.0 గ్రాములు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
fusarium wilt disease in chilli farming
కాండం కుళ్ళు తెగులు
లక్షణాలు
మొదట ఆకులు పసుపురంగులోకి మారుతాయి, తరవాత పైభాగంలో ఉన్న ఆకులు ఎండుతాయి త్వరలో మొక్క ఎండుతుంది, అలాగే పైకి మరియు క్రిందకి ఆకులు ముడుచుకుంటాయి.ఆకులు పసుపు రంగులోకి వస్తాయి మరియు చనిపోతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
మితలాస్జిల్ + మాన్కోజెబ్
200.0 గ్రాములు ఎకరానికి
Fruit borer of chilli
పండు తొలుచు పురుగు
లక్షణాలు
పండ్లమీద రంద్రాలు చేస్తాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
తయోమిథాక్సమ్+లంబాడా సైహల త్రిన్
100 మిల్లీలీటర్లు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
fruit rot in chilli farming
పండు కుళ్ళు తెగులు
లక్షణాలు
పండ్లపై గోధుమరంగు - నల్లటి మచ్చలు.కుళ్ళిపోవడం మరియు పండ్లు ఎండిపోడం
నియంత్రణ చర్యలు మొతాదు
కాపర్ఆక్సీక్లోరైడ్
200 గ్రాములు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి

పంట కోత

కోత వ్యవధి
కోత వ్యవధి
నాటు వేసిన 70 నుండి 150 రోజులు తరువాత.
కోతల సంఖ్య
8 to 10
రెండు కోతల మధ్య వ్యవధి
10 రోజులు

దిగుబడి

దిగుబడి
ప్రతి కోత యొక్క దిగుబడి
ఎకరాకు 5-8 క్వింటాల్.
మొత్తం కోత యొక్క దిగుబడి
ఎకరాకు 40-50 క్వింటాల్.

2 thoughts on “Green Chilli

 1. Pingback: Green Chilli - BharatAgri

 2. Pingback: मिर्च की खेती : आधुनिक विधि से लें ज्यादा से ज्यादा उपज - BharatAgri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *