Tomato

టమోటా

అంచనాలు

కోత అంచనా

100 క్వింటాల్ / ఎకరాకు

పంట వ్యవధి అంచనా

నాటు వేసిన 70-110 రోజుల

అంచనా పెట్టుబడి (రూపాయి)

91,897

అంచనా దిగుబడి (రూపాయి)

1,20,000

అనుకూలమైన వాతావరణ పరిస్థితులు

వాతావరణం
 • పూత  మరియు  పండ్లు కాసే సమయంలో భారీ వర్షాలు, మేఘావృతమైన వాతావరణం పువ్వులు మరియు పండ్లు తగ్గిపోవడానికి కారణం అవుతాయి.
 • మొక్కలు మంచు మరియు అధిక తేమ తట్టుకోలేవు .
 • అధిక తేమ పండ్లు కుళ్ళిపోవడానికి దారితీస్తుంది.
 • పండ్లు మొదలయ్యే సమయంలో ప్రకాశవంతమైన సూర్య కాంతి ముదురు ఎరుపు రంగు పండ్లు అభివృద్ధికి సహాయపడుతుంది
ఉష్ణోగ్రత
 • 10 ° C  ఉష్ణోగ్రత  తక్కువగా ఉంటె ,ఎదుగుదలను తగ్గిస్తుంది. 
 • ఉష్ణోగ్రత 33 ° C దాటి పోతే, పండ్ల అభివృద్ధి తీవ్రంగా ప్రభావితమవుతుంది.
 • ప్రారంభ పెరుగుదల దశలో ఉష్ణోగ్రత 38 ° C కంటే ఎక్కువ ఉంటె మొక్క పెరుగుదల తగ్గిస్తుంది.
 • 21-24 ° C వరకు ఉండే ఉష్ణోగ్రతలు టమోటోకు ఉత్తమమైనది.
పంట నీటి అవసరం
 • సాధారణంగా సాగునీటి ప్రాంతాలలో పెరుగుతుంది.
 • అధిక నాణ్యత తో  టమోటా పెరగడానికి ప్లాస్టిక్ కప్పడంతో పటు బిందు నీటి పారుదల  సిఫార్సు చేయాలి.
 • పంట ఎదిగే క్రమంలో పెద్ద మొత్తంలో నీరు అవసరం (30 రోజుల వరకు).
 • పంటకి  నీటి అవసరం-600-1500 మిల్లీమీటర్ల వర్షపాతంకి సమానం

అనుకూలమైన మట్టి పరిస్థితులు

మట్టి రకము
 • బంక మట్టి ,ఇంకా నీటిని పట్టుకునే సామర్ధ్యం ఉన్న నెలలు మంచివి

ఉదజని (పి. హెచ్.)
 • అవసరమైన పరిధి-  6.0-7.5
 • పి హెచ్  <6.0 సున్నం  జోడించండి.
 • పి హెచ్ >7.5 జిప్సం చేర్చండి

నర్సరీ తయారీ విధానం

నర్సరీ తయారీ విధానం

 విధానం-1

 • 1 ఎకరా ప్రాంతంలోనారు నాటడం  కోసం, 0.08 ఎకర (3 గుంటలు ) నర్సరీ అవసరం.
 • పరిమాణం 3 మీ. పొడవు X 1 మీ. వెడల్పు X 15 సెం.మీ. ఎత్తు ఆరు పడకలు నారు నాటడం కోసం సిద్ధం చెయ్యాలి.
 • విత్తనాలు 2-3 సెంటీమీటర్ల లోతులో 10 సెం.మీ. నేరుగా వేయండి మరియు మట్టితో కప్పండి.
 • నర్సరీని  రోజుకు రెండుసార్లు మొలకెత్తడానికి  ముందు మరియు ఒకసారి మొలకెతిన తరువాత, నీటితో తడపాలి . 
 • మొలకలు గట్టి పడటం కోసం ,నాటడానికి 4-5 రోజుల ముందే నారుమడికి పారుటకు నీటి ప్రవాహాన్ని తగ్గించాలి ,నాటు వేసే ముందు రోజు కొంచెం నీటిని నర్సరీకి అందించాలి. 

పద్ధతి– 2

 • కొబ్బరి పీచుతో ప్రో  ట్రేలు@ 1.2కేజీ ని ప్రతి ట్రేలో  నింపండి.
 • విత్తన శుద్ధి చేసిన విత్తనాలను ప్రో ట్రే లో @ 1 విత్తనం ,ఒక పెట్టికి చొప్పున పెట్టాలి
 • మొత్తం విత్తనాలిని కొక  పీట్ తో కప్పండి ,తర్వాత ఒక్కో ట్రే మీద ఒకటి పెట్టి మొత్తం పాలిథిన్తో కప్పండి మొలకవెత్తడం మొదలు అయ్యేవరకు{5రోజులు}.
 • 6 రోజుల తర్వాత, నీడ వలయంలోని పెరిగిన పడకల్లో వ్యక్తిగతంగా విత్తనాలు నాటు వేయాలి.
నర్సరీ వ్యవధి
 • వ్యవధి– 25-30 రోజులు
 • ఆకుల రంగులో ముదురు ఆకుపచ్చగా మారడం మరియు కాండం మందపాటి అయ్యేటప్పుడు మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి.
విత్తన మోతాదు
రకాలు
380-400 గ్రామ్స్ విత్తనాలు ఒక ఎకరాకు
హైబ్రీడ్స్ రకాలు
140-150 గ్రామ్స్ విత్తనాలు ఒక ఎకరాకు

విత్తన శుద్ధి

 క్రింది వాటితో విత్తన శుద్ధి చేయండి :

 • ఇమిడక్లోప్రిడ్– 4 మిల్లి లీటర్ 
 • సూచనలనుఒక కిలో  విత్తనాల కోసం రెండు లీటర్ల నీటిలో పైన పరిమాణం కలపండి. 10 నిమిషాలు, విత్తనాలు నానబెట్టాలి ,తర్వాత 15 నిమిషాలు పొడి ప్రదేశం లో ఆరబెట్టాలి . 
 • మాంకోజెబ్ – 2 గ్రాములు

సూచనలను– శుద్ధి చేసిన  కేజీ విత్తనాలను 2 గ్రాముల మాంకోజెబ్ తో పైభాగమున విత్తన శుద్ధి చేయండి

భూమి తయారీ

భూమి తయారీ
 1. నేల పద్ధతి – భూమి 1 లేదా 2 సార్లు నేల రకం ఆధారంగా దున్నాలి 

2) క్రింద చెప్పినవి  పొలం లొ కలపండి, బాగా కుళ్ళడానికి 10 రోజులు బహిరంగంగా ఉంచండి –

 1. a)  యఫ్ వై ఎం – 2 టన్నులు
 2. b) కంపోస్టింగ్ బాక్టీరియా – 3 కిలోలు 

3) పైన ఉన్న మిశ్రమాన్ని  నేల మొత్తం జల్లి రోటవేటర్,సాయం తో నేల మొత్తం దున్నాలి, మట్టి యొక్క సారవంతం కొరకు. 

బెడ్స్ తయారుచేయు విధానం
 • బెడ్ తయారీ– గట్లు సిద్ధం చెయ్యండి 120 సెంటి మీటర్ వెడల్పు , 90 సెం.మీ, ట్రాక్టర్ సహాయంతో చెయ్యాలి.

సార్ల మధ్య దూరము మరియు మొక్క జనాభ

రకాలు
సార్లకు మధ్య దూరము
2.9 అడుగులు
మొక్కల మధ్య దూరము
0.9 అడుగులు
మొక్కల సంఖ్య
16,858
హైబ్రీడ్స్ రకాలు
సార్లకు మధ్య దూరము
2.4 అడుగులు
మొక్కల మధ్య దూరము
0.9 అడుగులు
మొక్కల సంఖ్య
20,370

వేరు ముంచు చికిత్స

 •  ఒక పాత్ర లొ 20 లీటర్ల నీరు తీసుకోండి.
 • 40 గ్రాములు కార్బెండజిమ్ + 40 మీ లీ ఇమిడాక్లోప్రిడ్ కలపండి + 100 గ్రాముల మొక్కల పెరుగుదల ప్రోత్సహించే  రైజోబాక్టర్ .
 • నారు  వేసే ముందు ,పైన ఉన్న మందు కలిపిన నీటిలో వేరులను ముంచి నాటండి
 • ప్రో ట్రేలు లో మొక్కలను – 5నిముషాలు  మందు నీటిలో ముంచండి.

నారు నాటడం

 • నారు మొక్కలను ప్రదాన  పొలంలొ 30 సెం.మీ. దూరంలొ నాటుట

పోషక నిర్వహణ

 • రకాలకు – మొత్తం అవసరం 80:40:40 కేజీ,నత్రజని: భాస్ఫారమ్: పోటాష్ ,ఒక ఎకరాకు
 • విత్తనాలు నాటేటప్పుడు– 
 •  87కేజీ యూరియా + 246 కేజీ యస్ యస్ పి  + 67 కేజీ ఎం ఒ పి (ఒక ఎకరాకు)
 • 30 రోజులు నాటిన తర్వాత 44 కేజీ యూరియా
 • 50రోజులు నాటిన తర్వాత 44 కేజీ యూరియా
 • సంకర రకాలకు – మొత్తం అవసరం 120:60:60 నత్రజని: భాస్ఫారమ్: పోటాష్ ,ఒక ఎకరాకు. 
 • విత్తనాలు నాటేటప్పుడు-
 • యూరియా -130 కిలో సింగల్ సూపర్ ఫాస్ఫేట్ -375 కిలో మురియట్ అఫ్ పోటాష్ -100 కిలో 
 • 30 రోజులు నాటిన తర్వాత- 65 కేజీ యూరియా
 • 50 రోజులు నాటిన తర్వాత-65 కేజీ యూరియా

నీటిపారుదల

 • బిందు నీటిపారుదల – ప్రత్యామ్నాయ రోజున
 • వరద నీటిపారుదల – 8-10 రోజులకు ఒక సారి (శీతాకాలం), 6-8 రోజులకు ఒక సారి (వేసవి)
 • స్ప్రింక్లర్ నీటిపారుదల నియంత్రించాలి, ఎందుకంటే దాని వలన , శిలీంధ్ర వ్యాధులు ఉండటం మరియు బాక్టీరియా వ్యాధి  వంటివి ప్రధాన సమస్యగా మారవచ్చు.
 • పూత సమయం లో అధిక నీటి పారుదల వలన ,పువ్వు లు ఎక్కువ రాలిపోయి అవకాశం ఉంది ,ఇంకా పండు నిర్మాణం కూడా తగ్గుతుంది
 • పండ్ల పగుళ్ళుని నివారించడానికి  నీటి ఒత్తిడిని మరియు దీర్ఘ కాలం తడిగా వుండే  నేలను నివారించండి

పరస్పర కార్యకలాపాలు

కలుపు నిర్వహణ

3 Days after transplanting
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
పెండిమేథాలిన్ లేదా ఫ్లూక్లోరలిన్
కలుపు మందు పరిమాణం
400 మీ. లి /ఎకరానికి 400 మీ. లి /ఎకరానికి
30 Days after transplanting
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
ఆక్సీఫ్లూరోఫిన్
కలుపు మందు పరిమాణం
100 గ్రామ్/ఎకరానికి

పెరుగుదల నియంత్రకాలు

 • పూత ని మెరుగు పరచడానికి , ట్రైకోంటనాల్ @ 1.25 మి.లీ. /లీటర్ నీటిలో కలిపి , నాటు వేసిన 20,40,60 రోజుల తర్వాత పిచికారీ చెయ్యాలి 
 • పూత రాలుట ఇంకా పండ్ల పరిమాణం ఎదుగుదలకు నప్తలిన్ అసిటిక్ ఆసిడ్[యన్  ఏ ఏ ]@ 2 మిల్లి. లీ , లీటర్ నీటిలో కలిపి ,నాటు వేసిన 60 మరియు 90 రోజులకి పిచికారీ చెయ్యాలి .

తెగులు మరియు పురుగు నిర్వహణ

टमाटर की खेती के रोग एवं उपचार
మొదలు ఎండు తెగులు
లక్షణాలు
ఆకులపై లోపలికి వృత్తాకార గోదుమ రంగుతో వెలుపలికి పసుపురంగు కలిగిన మచ్చలు ఉంటాయి.తీవ్రమైన సందర్భంలో ఆకులు గోధుమ రంగులోకి మారిపోతాయి మరియు రాలిపోతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
మాన్కోజెబ్
250.0 గ్రాములు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
टमाटर के पौधों में रोग - फळे पोखरणारी अळी
పండు తొలుచు పురుగు
లక్షణాలు
పండ్లమీద రంద్రాలు చేస్తాయి.యవ్వనపు లార్వాలు చిగురించిన ఆకులను తింటాయి, పెద్ద లార్వాలు వృత్తాకార రంధ్రాలు చేసి శరీరంలో ఒక భాగం మాత్రమే పండులోకి త్రొసి లోపల ఉన్న గుజ్జును తింటుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
ప్లీతోరా (ఇండోక్సక్రాబ్ + నోవలురన్)
200 మిల్లి లీటర్లు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
टमाटर की खेती के रोग - मोझॅक व्हायरस
మొజాయిక్ వైరస్
లక్షణాలు
ఆకుల మడత.ఆకులు చుట్టుకుపోవడం మరియు గోదుమ రంగులోకి మారడం జరుగుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
డైమిథోయేట్
200 మిల్లి లీటర్లు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
टमाटर का पांढरी भुरी रोग
బూజు తెగులు
లక్షణాలు
ఆకులు మరియు కాండం మీద తెలుపు బూజు పెరుగుదల.
నియంత్రణ చర్యలు మొతాదు
తడి సల్ఫర్
200 గ్రాములు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
टमाटर के रोग एवं उपचार - रसशोषक किडी
రసం పీల్చే పురుగులు
లక్షణాలు
ఆకులూ పైకి ముడుచుకుపోతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
అసెటమాప్రిడ్
200 గ్రాములు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
टमाटर की खेती के रोग - मर रोग
తడి కుళ్ళు
లక్షణాలు
మొలకెత్తిన మొక్కకు అక్కడియితే లేత కొమ్మ భూమికి ఆని ఉంటుందో అక్కడ పుండులాగా ఏర్పడి మొక్క కూలిపోతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
మితలాస్జిల్
200 గ్రాములు ఎకరానికి
కాపర్ ఆక్సీక్లోరైడ్
250 గ్రాములు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి వేరు ప్రదేశంలో తడపాలి
टमाटर के पौधों में रोग - उशिरा येणारा करपा
చివరి ఎండు తెగులు
లక్షణాలు
వ్యాధి అంటడం వల్ల అన్ని ఆకులకు తెగుళ్లు రావడం, పొడిబారిపోవడం, మరియు నెల రాలడం జరుగుతుంది. క్రమంగా కాండం నెల కూలడం మరియు మొక్క ఎండిపోవడం జరుగుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
క్లోరోతలోనిల్
200 మిల్లి లీటర్లు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
टमाटर की बीमारी - पाने खाणारी अळी
ఆకు ముడత పురుగు
లక్షణాలు
లార్వాల ఆకులోకి చొచ్చుకుని సారాన్ని పీల్చుకొని ఆకు మీద చిన్న గోధుమ రంగు మచ్చలను ఏర్పడుస్తాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
లాంబ్డా - సైహాలోత్రిన
200 మిల్లి లీటర్లు ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి

పంట కోత

కోత వ్యవధి
కోత వ్యవధి
నాటు వేసిన 70-110 రోజుల తర్వాత
కోతల సంఖ్య
8 to 10
రెండు కోతల మధ్య వ్యవధి
3 రోజులు

దిగుబడి

దిగుబడి
ప్రతి కోత యొక్క దిగుబడి
10 క్వింటాల్ /ఎకరాకు
మొత్తం కోత యొక్క దిగుబడి
100క్వింటాల్ /ఎకరాకు

3 thoughts on “Tomato

 1. Pingback: Tomato - BharatAgri

 2. Pingback: टमाटर की खेती - BharatAgri

 3. Pingback: टमाटर की खेती - BharatAgri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *