Potato

బంగాళాదుంప

అంచనాలు

కోత అంచనా

100-180 క్వింటాల్/ ఎకరానికి

పంట వ్యవధి అంచనా

నాటు వేసిన 100-110 రోజుల తర్వాత

అంచనా పెట్టుబడి (రూపాయి)

45000

అంచనా దిగుబడి (రూపాయి)

1,68,000

అనుకూలమైన వాతావరణ పరిస్థితులు

వాతావరణం
 • చల్లని ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో బంగాళదుంప పెరుగుదలకు  అనుకూలమైనది
ఉష్ణోగ్రత
 •  మొక్క ఏపుగా వృద్ధి చెందడానికి  24 °C వద్ద ఉత్తమం, అయితే 20 °C వద్ద దుంప పెరుగుదల ఉంటుంది.              
 • 20-25 °C ఉష్ణోగ్రత పెరుగుదలకు అనువైనది.
పంట నీటి అవసరం
 •  మొలకెత్తే సమయంలో , భూగర్భ కాండం నిర్మాణాప్పుడు  మరియు దుంప అభివృద్ధి అత్యంత క్లిష్టమైన దశలలో నీటిని  అందుబాటులో ఉంచాలి. 
 • నీటి అవసరం- వర్షపాతం 500-700 మిల్లీమీటర్లకి సమానంగా ఉండాలి.

అనుకూలమైన మట్టి పరిస్థితులు

మట్టి రకము
 • ఉప్పు మరియు ఆల్కలీన్ నేలలు మినహాయించి  ఎటువంటి రకం నేలలో అయినా పెంచవచ్చు.
 • ఇసుక రేగడ, సన్న ఇసుక రేగడ, రేగడ మరియు బంక మట్టి  (మట్టి వదులుగా ఉండాలి)ఉదజని (పి. హెచ్.)
 • 5.0-6.5 (కొద్దిగా ఆమ్ల నేల)
  • తీవ్రమైన ఆల్కలీన్ నేలలలో బంగాళాదుంపను పెంచడానికి తగినది కాదు
 • ఉదజని <5.5 ఉంటే సున్నం జోడించండి. 
 • ఉదజని >7.5 ఉంటే జిప్సంని చేర్చండి.

నాటడానికి అవసరమైనవి

కుఫ్రి జ్యోతి
కాలము
100 రోజులు
ప్రత్యేక లక్షణాలు
తెలుపు మరియు పెద్దవిగా ఆకారం లో ఉంటూ తెగ్గుళ్లను వెతిరేకిస్తాయి
కుఫ్రి బాదుషా
కాలము
110 రోజుల
ప్రత్యేక లక్షణాలు
తెగ్గుళ్లను వెతిరేకిస్తాయి

విత్తన మోతాదు

విత్తన మోతాదు
రకాలు
ఎకరానికి 600-800 కేజీలు/ఎకరానికి (బంగాళాదుంపను చిన్న ముక్కలు కొయ్యాలి ఒక ముక్కకు కనీసం 2 కన్నులు ఉండేలా చూసుకోవాలి).

విత్తన శుద్ధి

 • దుంపలను క్రింద విధంగా శుద్ధి చెయ్యండి,
 • 800 కేజీలు విత్తనాలకి ఒక డ్రమ్ లో 200 లీటర్లు నీటి లో 4 కేజీ అజోటోబ్యాక్టర్ కలిపి విత్తనాలను మిశ్రమంలో 30 నిమిషాలు ముంచి తరవాత నాటాలి. 

 

భూమి తయారీ

భూమి తయారీ
 •  ద్దున్నాల్సిన విధానం: నేల రకంబట్టి 1 లేదా 2 సార్లు ద్దున్నాలి.  
 • పశువుల ఎరువు – 2 టన్నులు  మరియు 3కేజీల  కంపోస్టింగ్ బాక్టీరియా (ఎరువు తయారు అవుటకు సహాయపడే) కలిపి గాలికి 10 రోజులు కుళ్లడానికి విడిచిపెట్టాలి. 
 • పైన ఉన్న మిశ్రమాన్ని నేల మొత్తం జల్లి రోటవేటర్,సాయంతో నేల మొత్తం ద్దున్నాలి, దీనివలన భూమి సారం పెరుగుతుంది.
బెడ్స్ తయారుచేయు విధానం
 •  ట్రాక్టర్ సాయంతో 60 సెం.మీ. దూరంతో  గట్లను – గాళ్ళను సిద్ధం చెయ్యాలి  

సాళ్ల మధ్య దూరము మరియు మొక్క జనాభ

రకాలు
వరసకు వరసకు మధ్య దూరం
1.9 అడుగులు
మొక్కల మధ్య దూరము
0.7 అడుగులు
మొక్కల సంఖ్య
33,082

నాటడం

 •  మొలకెత్తిన మొలకలను 20 సేం.మి దూరంతో నాటాలి, నాటేటప్పుడు  మొలకొచ్చిన భాగం పైకి ఉండాలి
 • నాటిన మొలకలను నాశనం కాకూండా చూసుకోవాలి

పోషక నిర్వహణ

 • మొత్తం పోషక అవసరాలు: ఒక ఎకరాకు 40: 55:40 కేజీల నత్రజని, బస్పరం మరియు పొటాషియం అందించాలి.  
 • విత్తనాలు నాటే సమయంలో 43 కిలోల యూరియా మరియు 338 కిలోల ఎస్ ఎస్ పి  67 కేజీ ఎమ్ ఓ పి మరియు 25కేజీ MgSo4
 • నాటు వేసిన 30 రోజుల తర్వాత 22 కేజీ యూరియా వెయ్యాలి. 

నాటు వేసిన 45 రోజుల తర్వాత 22 కేజీ యూరియా వెయ్యాలి.

నీటిపారుదల

 • డ్రిప్-  3 రోజులకి  ఒకసారి
 • వరద నీటి పారుదల – 5-7 రోజుల తరువాత మొదటి నీటిపారుదల కొద్దిగా ఉండాలి మరియు 7-15 రోజుల వ్యవధిలో వాతావరణం బట్టి మరియు మట్టిని బట్టి తదుపరి నీటిపారుదల ఇవ్వబడుతుంది.

అంతర పంట సాగు పద్ధతులు :

 • ఎదబెట్టడం : నాటు నాటిన 30 రోజులు తర్వాత 2 సార్లు మరియు నాటు నాటిన 60 రోజుల తర్వాత  (గట్లను గాళ్ళ కింద మార్చాలి ). 

పరస్పర కార్యకలాపాలు

కలుపు నిర్వహణ

నాటు వేసిన 3 రోజుల తర్వాత
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
మెట్రిబుజిన్ OR పెండిమిథాలీన్
కలుపు సంహారకం పరిమాణం
300 గ్రాములు/ ఎకరానికి 200 గ్రాములు /ఎకరానికి
నాటు వేసిన 45 రోజుల తర్వాత
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
ఆక్సీఫ్లూరోఫిన్
కలుపు సంహారకం పరిమాణం
1 లీటరు /ఎకరానికి

పెరుగుదల నియంత్రకాలు

దుంప దిగుబడి పెంచడానికి 200 లీటర్ నీటిలో 100 గ్రాములు  ఎథెఫోన్ లేదా జిబ్రేలిక్ యాసిడ్ 200 మిల్లి లీటర్లు  కలిపి నాటు నాటిన 30-70 రోజులు తరవాత ఆకుల మీద పిచికారీ చెయ్యాలి.   

తెగులు మరియు పురుగు నిర్వహణ

బంగాళదుంప-బాక్టీరియా ఎండు తెగులు
లక్షణాలు
వ్యాధి సోకిన మొక్క ఆకుల మొదళ్ళ నుంచి ఎండిపోతూ వస్తుంది. ఆకుల అడుగు భాగం పసుపు రంగులోకి మారి మొక్క మొత్తం ఎండిపోయి చివరికి చనిపోతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
కాపర్ఆక్సీక్లోరైడ్
500 గ్రాములు/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి వేరు ప్రదేశంలో తడపాలి
మొదలు ఎండు తెగులు
లక్షణాలు
ప్రభావిత ఆకులు చిన్న, ముదురు గోధుమ రంగు మచ్చలు కలిగి తరచుగా పరిమాణంలో పెరుగుతాయి, మరియు చివరికి ఆకులను చంపేస్తాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
క్లోరోతలోనిల్
200 గ్రాములు/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
చివరి ఎండు తెగులు
లక్షణాలు
వ్యాధి అంటడం వల్ల అన్ని ఆకులకు తెగుళ్లు రావడం, పొడిబారిపోవడం, మరియు నెల రాలడం జరుగుతుంది. క్రమంగా కాండం నెల కూలడం మరియు మొక్క ఎండిపోవడం జరుగుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
క్లోరోతలోనిల్
300 గ్రాములు/ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
బంగాళదుంప పురుగు
లక్షణాలు
ఆకులకు చిన్న రంధ్రాలు ఉంటాయి. వయోజన మరియు నల్ల మచ్చల ఎరుపు లార్వా బంగాళాదుంప ఆకులపై దాడిచేస్తాయి. వాటి దాడి వల్ల దిగుబడి బాగా తగ్గిపోతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
ఇమిడాక్లోప్రిడ్
200 మిల్లి లీటర్లు/ ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
బంగాళదుంప కుళ్ళు తెగులు
లక్షణాలు
కణజాలము లోపల నుండి చనిపోతూ బయటకు నలుపు రంగులోకి మారుతుంది. వ్యాధి సోకిన దుంపలకి తరువాత కాలంలో తెగుళ్ళు పడుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
స్ట్రెప్టోసైక్లిన్
200 మిల్లి లీటర్లు/ ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి వేరు ప్రదేశంలో తడపాలి
రసం పీల్చే పురుగులు
లక్షణాలు
ఆకుల పరిమాణంలో తగ్గుదల, పసుపురంగులోకి మారడం, ముడుచుకుపోవడం, అంచుల్లో ఎండిపోవడం మరియు ఆకు కాడతోసహా విరిగిపోవడం జరుగుతుంది. ఆకులు చిన్న పరిమాణంలో ఉంటాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
డైమిథోయేట్
200 మిల్లి లీటర్లు/ ఎకరానికి
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి

పంట కోత

కోత వ్యవధి
కోత వ్యవధి
నాటు వేసిన 100 నుంచి 110 రోజులు

దిగుబడి

దిగుబడి
మొత్తం కోత యొక్క దిగుబడి
100-180 క్వింటాల్ /ఎకరాకు

2 thoughts on “Potato

 1. Pingback: Potato - BharatAgri

 2. Pingback: Potato - BharatAgri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *