Brinjal

వంకాయ

అంచనాలు

కోత అంచనా

60 క్వింటాల్ /ఎకరానికి

పంట వ్యవధి అంచనా

నాటు వేసిన 140-150 రోజుల తర్వాత

అంచనా పెట్టుబడి (రూపాయి)

39,166 

అంచనా దిగుబడి (రూపాయి)

60,000

అనుకూలమైన వాతావరణ పరిస్థితులు

వాతావరణం
  • వంకాయ వేసవి కాలం పంట మరియు దీర్ఘ కాలం పాటు ఈ పంటకు వేడి వాతావరణం కావాలి.
  • ఇది మంచును తట్టుకోలేదు.
ఉష్ణోగ్రత
 • రోజులో 35 oC కంటే తక్కువ ఉష్ణోగ్రత మరియు రాత్రి 16oC పైన ఉష్ణోగ్రత సరైనవిగా పరిగణించబడుతుంది.
 • 15oC  కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే మొక్కల పెరుగుదలతో పాటు పండ్ల నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
 •  13-21oC వరకు ఉండే ఉష్ణోగ్రత వంగ పంటకు అనుకూలమైనవి.
 • తక్కువ తేమ మరియు అధిక ఉష్ణోగ్రత భారీగా పూత రాలిపోవడానికి మరియు పేలవమైన పండ్ల ఏర్పాటుకు కారణమవుతాయి.
పంట నీటి అవసరం
  • నీటి అవసరం- 600-1000 మి.మీ వర్షపాతానికి సమానమైన నీరు అవసరం.
  • ఇది పూత మరియు కాయ కాపు దశ సమయంలో అధిక వర్షపాతాన్ని తట్టుకోలేదు.
  • అధిక వర్షపాతం వలన మొక్క ఆకులు రాలిపోవడం, వాడిపోవడం మరియు మొక్కలు కుళ్ళిపోవడం జరుగుతుంది

అనుకూలమైన మట్టి పరిస్థితులు

మట్టి రకము
  • మంచి నీటి పట్టు సామర్థ్యం కలిగిన ఇసుక రేగడి నేల మరియు భారీ బంకమట్టి నేలలు అనుకూలమైనవి .
  • బాగా నీటి పారుదల మరియు సారవంతమైన నేలలు పంటకు ప్రాధాన్యత ఇవ్వబడతాయి.
ఉదజని (పి. హెచ్.)
  • అవసరమైన పరిధి- 6.5 – 7.5
  • ఉదజని <6.5 కన్నా ఎక్కువైతే సున్నం ను  జోడించండి.
  • ఉదజని >7.5 కన్నా ఎక్కువైతే జిప్సం ను జోడించండి.

నాటడానికి అవసరమైనవి

మంజరి(వంకాయ)
కాలము
60 రోజులు
ప్రత్యేక లక్షణాలు
వంగరంగు ఓవల్ అండాకారం కలిగిన కాయలు.అన్ని కాలాలలో పండించుకోచ్చు.
దిగుబడి
55-70 క్వింటాల్/ఎకరా
కాలం
ఖరీఫ్
పూస హైబ్రిడ్-5
కాలము
80 రోజులు
ప్రత్యేక లక్షణాలు
ముళ్ళు లేకుండా, సగం నిటారుగా ఉన్న కొమ్మలు ఉంటాయి పొడవాటి పండ్లు, నిగనిగలాడే ఆకర్షణీయమైన, ముదురు వంగ రంగులో పాక్షికంగా వర్ణద్రవ్యం కాడ కలిగి ఒక్కొక్క కాయ100 గ్రా బరువు ఉంటుంది.
దిగుబడి
100-110 క్వింటాల్/ఎకరా
కాలం
ఖరీఫ్
పంత్ రితురాజ్
కాలము
75 రోజులు
ప్రత్యేక లక్షణాలు
పండ్లు దాదాపు గుండ్రంగా ఉంటాయి. ఆకర్షణీయమైన వంగ రంగు, మృదువైన, తక్కువ విత్తనం మరియు మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియా ఎండు తెగులు, క్షేత్ర నిరోధకతను కలిగి ఉంటుంది.
దిగుబడి
127 క్వింటాల్/ఎకరానికి
కాలం
ఖరీఫ్

నర్సరీ తయారీ విధానం

నర్సరీ తయారీ విధానం

పద్ధతి-1

 • 1 ఎకరా విస్తీర్ణంలో నాటడానికి 0.1 ఎకరా (4 గుంట) నర్సరీ అవసరం.
 • 7.2 మీటర్ల పొడవు X 1.2 మీ వెడల్పు X 10 సెం.మీ ఎత్తు గల నాలుగు నారు మడులను సిద్ధం చేయండి.
 • విత్తనాలను వరుసలో 5 సెంటీమీటర్ల దూరంలో  విత్తండి మరియు మట్టితో కప్పండి.
 • అంకురోత్పత్తి వరకు ప్రతిరోజూ రెండుసార్లు మరియు అంకురోత్పత్తి తర్వాత ఒకసారి నర్సరీ నీళ్ళు పెట్టండి.
 • నాటడానికి పది రోజుల ముందు మొలకలు గట్టిపడటానికి నర్సరీ నారు మడులకు నీటి సాగు పరిమాణాన్ని తగ్గించండి.
 • తడి కుళ్ళు తెగులు నుండి మొలకలను రక్షించడానికి విత్తనాలు మొలిచిన 3 రోజుల తరువాత నారు మడిని రిడోమిల్ 20 గ్రాములను 10 లీటర్ల నీటిలో కలిపి మొక్క మొదళ్ళ దగ్గర వేయండి.
 • విత్తనాలు వేసిన 25 రోజులకు 19:19:19@  5 గ్రాములు + థియామెథోక్సం@ 0.25 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయండి.

పద్ధతి-2

 • ప్రో ట్రేలను కొబ్బరి పీచు @ 1.2 కిలోలతో నింపండి. 
 • చికిత్స చేసిన విత్తనాలను ప్రోట్రేలో ప్రతి సెల్ కి ఒక విత్తనంను నాటండి.
 • విత్తనాన్ని కోకోపీట్‌తో కప్పండి మరియు పోట్రేలను ఒకదాని పైన ఒకటి ఉంచండి మరియు అంకురోత్పత్తి ప్రారంభమయ్యే వరకు పాలిథిన్ షీట్‌తో కప్పండి (5 రోజులు).
 • 6 రోజుల తరువాత, మొలకెత్తిన విత్తనాలతో ప్రో ట్రేలను ఒక్కొక్కటిగా నీడ నెట్‌లో ఉంచండి.
నర్సరీ వ్యవధి
 • 30-35 రోజులు
 • మొలకల 2-3 లేత ఆకులతో 15 సెం.మీ ఎత్తును చేరుకున్నప్పుడు నాటడానికి సిద్ధంగా ఉంటాయి.
విత్తన మోతాదు
రకాలు
1 ఎకరా విస్తీర్ణంలో నాటడానికి 160 గ్రా-161గ్రా విత్తనాలు అవసరం
హైబ్రీడ్స్ రకాలు
1 ఎకరా విస్తీర్ణంలో నాటడానికి 80 గ్రాముల- 81 గ్రాముల విత్తనాలు అవసరం

విత్తన శుద్ధి

   విత్తనాలను చికిత్స చేయండి-

 • ఇమిడాక్లోప్రిడ్ – 4 మి.లీ

సూచనలు – పై పరిమాణాన్ని ఒక కిలో విత్తనాలకు రెండు లీటర్ల నీటిలో కలపండి. విత్తనాలను 10 నిమిషాలు ద్రావణంలో ముంచి, ఆపై 15 నిమిషాలు ఆరబెట్టండి.

 • కార్బెండజిమ్ – 2 గ్రా

సూచనలు – పైన చికిత్స చేసిన విత్తనాలను 1 కిలో విత్తనాలకు కార్బెండజిమ్ 2 గ్రాములతో మళ్లీ చికిత్స చేయాలి.

భూమి తయారీ

భూమి తయారీ
 1. దున్నేపద్ధతి – నేల రకం ఆధారంగా భూమిని 1 లేదా 2 సార్లు దున్నాలి.
 2. పొలం‌లో కింది వాటిని కలపండి మరియు సరైన విధంగా కుళ్ళిపోవటానికి 10 రోజులు బహిరంగ ప్రదేశంలో ఉంచండి పశువుల ఎరువు – 2 టన్నులు.                                                                                                                                                కంపోస్టింగ్ బాక్టీరియా – 3 కిలోలు

పై మిశ్రమాన్ని మట్టిపై విస్తరించి, చక్కగా మట్టిని బాగుచేయడానికి రోటవేటర్‌ను మొత్తం పొలంలో నడపండి.

బెడ్స్ తయారుచేయు విధానం
 • బెడ్ తయారీ- ట్రాక్టర్ సహాయంతో 2 అడుగులు లేదా 3 అడుగులు దూరంలో గట్లను మరియు గాళ్ళను సిద్ధం చేయండి.

సాళ్ల మధ్య దూరము మరియు మొక్క జనాభ

రకాలు
సాళ్ల మధ్య దూరము
2 అడుగులు
మొక్కల మధ్య దూరము
2 అడుగులు
మొక్కల సంఖ్య
11,000
హైబ్రీడ్ రకాలు
సాళ్ల మధ్య దూరము
3 అడుగులు
మొక్కల మధ్య దూరము
2 అడుగులు
మొక్కల సంఖ్య
7,333

వేరు ముంచు చికిత్స

 • 20 లీటర్ల నీటిని ఒక డబ్బాలో తీసుకోండి.
 • 40 గ్రా కార్బన్డజియం + 40 మిలీ ఇమిడాక్లోప్రిడ్ను కలపండి
  నారు నాటే ముందు 5 నిముషాల పాటు ఈ మిశ్రమంలో నారు వేరులను ముంచండి
  పోట్రేలలో ఉన్న మొక్కలను – పోట్రేలను 5 నిముషాలపాటు ఈ మిశ్రమం ఉన్న పాత్రలో ముంచండి.

నాట్లు వేయడం

సాళ్ళ మీద 60 సెమీ దూరానికి నారు మొక్కలను నాటండి.
మట్టిలో గాలిని పోయేలా చేయడానికి వేర్ల దగ్గర మట్టిని గట్టిగా నొక్కివేయండి
ఎండ తాకిడి నుండి మొక్కలను కాపాడడానికి సాయంత్రాల కాలంలో నారు నాటడం మంచిది.

పోషకాల నిర్వహణ

మొత్తం అవసరమైనవి
ఎకరానికి 100:50:30 కేజి NPK
విత్తనాలు వేసేటప్పుడు
యూరియా – 109 కేజి
సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ -308 కేజి
మ్యురేట్ అఫ్ పొటాష్ – 50 కేజి

నాటిన 30 రోజులకు
యూరియా -54 కేజి
నాటిన 45 రోజులకు
యూరియా – 54 కేజి

నీటిపారుదల

  • బిందుపద్దతి – ఒక రోజు తరువాత ఒక రోజు
  • వరద నీరు- వారానికి రెండు సార్లు (వర్షపాతం ఆధారంగా)

  వేసవి కాలం- 3-4 రోజుల వ్యవధితో

  వంకాయ యొక్క ప్రతి పంట కోత తరువాత ఒక నీటిపారుదల అందించాలి.

పరస్పర కార్యకలాపాలు

కలుపు నిర్వహణ

నాటిన 3 రోజులకు
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
ఆట్రజిన్ లేదా పెండిమిథాలిన్
కలుపు సంహారకం మోతాదు
ఎకరానికి 100 గ్రా , ఎకరానికి 300 గ్రా
నాటిన 45 రోజుల తరువాత
పద్ధతి
పిచికారీ
కలుపు సంహారకం పేరు
2,4 D
కలుపు సంహారకం మోతాదు
ఎకరానికి 400 గ్రా

మొక్క మొదళ్లకు మట్టి ఎగదోయడం

 • మూలాలను మట్టితో కప్పండి. 
 • నాట్లు వేసిన 30 రోజుల తరువాత (పుష్పించే సమయంలో)

తెగులు మరియు పురుగు నిర్వహణ

మట్టిలో పుట్టి వచ్చే వ్యాధులు
లక్షణాలు
పంట ఎదుగుదల తక్కువగా ఉంటుంది.వేర్లు పాడైపోతాయి,మొక్కలు వళ్ళిపోతాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
ట్రైకోడెర్మా విరిడే సూడోమోనాస్
ఎకరానికి 40 గ్రా ఎకరానికి 40 గ్రా
నియంత్రణ చర్య పద్ధతి
చోటు మార్చి నాటునప్పుడు నీటిలో ముంచాలి.
వంకాయా కాయ తొలుచు పురుగు మరియు కాండం తొలుచు పురుగు
లక్షణాలు
ఉచ్చులు లో ఫేర్మోన్ క్రిమిని ఆకర్షించి మరియు సంహరిస్తుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
ఫిరోమోన్ ట్రాప్స్
5
నియంత్రణ చర్య పద్ధతి
పొలంలో పెట్టాలి.
వంకాయా కాయ తొలుచు పురుగు మరియు కాండం తొలుచు పురుగు
లక్షణాలు
కొమ్మలకి రంద్రాలు చేసి మరియు పండ్లులో విసర్జనను నింపుతాయి. ఎగువ భాగం నుండి కాండం లోకి లార్వా ప్రవేశిస్తుంది మరియు అంతర్గత పదార్థముని తింటుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
ఎమమెక్టిన్ బెన్జోఎట్
100 మీ.లి./ఎకరాకు
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి
ఆకు మచ్చ
లక్షణాలు
క్లోరోటిక్ గాయాలు, కోణీయ ఆకారంలో క్రమరహితంగా ఉంటాయి. తీవ్రంగా సోకిన ఆకులు ముందుగానే రాలిపోతాయి, తద్వారా తగ్గిన పండు దిగుబడి అవుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
మాన్కోజెబ్
200 గ్రామ్ / ఎకరాకు
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
వంగలో వెర్రి తెగులు
లక్షణాలు
ఆకులు పరిమాణం తగ్గింపు. పుష్ప భాగాలను ఆకు ఆకృతులలోకి మార్చడం. మైకోప్లాస్మ్ (ఫంగీజాతి జీవుల భుజించునది ) లాంటి జీవులు వల్ల వస్తుంది, మరియు ఆకు దోమ ద్వారా వ్యాపించబడుతుంది.
నియంత్రణ చర్యలు మొతాదు
డైమిథోయేట్
200 మీ.లి./ఎకరాకు
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
తడి కుళ్ళు
లక్షణాలు
మొక్కలు సులభంగా బయటకు లాగవచ్చును మరియు మూలాలు నష్టం చూపిస్తాయి.
నియంత్రణ చర్యలు మొతాదు
కాపర్ఆక్సీక్లోరైడ్
250 గ్రామ్ / ఎకరాకు
నియంత్రణ చర్య పద్ధతి
నీటిలో కలిపి వేరు ప్రదేశంలో తడపాలి.

పంట కోత

కోత వ్యవధి
కోత వ్యవధి
నాట్లు వేసిన 70- 130 రోజుల తరువాత
కోతల సంఖ్య
8 నుండి 10
రెండు కోతల మధ్య వ్యవధి
5 రోజులు

దిగుబడి

దిగుబడి
ప్రతి కోత యొక్క దిగుబడి
ఎకరానికి 6 క్వింటాల్
మొత్తం కోత యొక్క దిగుబడి
ఎకరానికి 60 క్వింటాల్

2 thoughts on “Brinjal

 1. Pingback: Brinjal_English – LeanAgri

 2. Pingback: Brinjal – BharatAgri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *